అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన కొనసాగుతోంది. భారత్ చేరుకున్న ట్రంప్ మెలనియా దంపతులకు మోదీ ఘనస్వాగతం పలికారు. అయితే అమెరికా అధ్యక్షడి భద్రత విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తుందో ఆయన ప్రయాణించే కారు 'ద బీస్ట్' గురించి తెలుసుకుంటేనే అర్థమైపోతుంది. భారత్‌లో డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ 22 కి.మీ. మేర రోడ్డు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణం మొత్తం అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చిన కార్లలోనే కొనసాగింది. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే కారు 'ది బీస్ట్'. ఇది ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన, సురక్షితమైన కారు. దీన్ని కాడిలాక్ వన్, ఫస్ట్ కార్ అని కూడా పిలుస్తుంటారు. చదవండి: చేతిలో చెయ్యి వేసుకుని.. తాజ్ అందాలు వీక్షిస్తూ..
ట్రంప్ కారు ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!